వైసీపీ, బీజేపీ బంధం చెడగొట్టడానికి చంద్రబాబు వేస్తున్న ప్లాన్ అదిరిందిగా.. ?

 

ఏపీలో రోజు రోజుకు టీడీపీ పరిస్దితి జీరోలా మారుతుందనే ప్రచారం జరుగుతుంది.. రానున్న రోజుల్లో తుక్కుపట్టనున్న సైకిల్‌కు రిపేరింగ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడట.. ఇప్పటికే అధికార పార్టీలోకి వరసగా దారి కట్టిన టీడీపీ శ్రేణులతో వైసీపీ నిండిపోయిన జలాశయాల్ల కనిపిస్తుండగా, కళాహీనంగా మారిపోయిన పార్టీ పరిస్దితికి బాబుగారు లోలోన మధనపడుతున్నారట.. ఇక జనసేనతో పొత్తు, బీజేపీతో వైరం ఈ రెండు కూడా టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాయి.. అందువల్ల పవన్ తో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు ఒంటరిగా ఆ పార్టీని నిలబెట్టుకునే సత్తాలేక, వైసీపీని ఢీకొట్టే బలం లేక నీరసపడిపోతున్న సమయంలో వచ్చిన ఆలోచనతో కొంతైన పార్టీకి మేలు జరుగుతుందని అనుకుంటున్నాడట. అందుకే ఇలాంటి పరిస్దితుల్లో బీజేపీ, వైసీపీ బంధాన్ని విడగొట్టాలి. ఆ చీకటి బంధాన్ని చెడగొట్టి వైసీపీని ఏకాకిని చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఉన్నాడట..

ఇకపోతే గడిచిన ఎన్నికల్లో జగన్ కి పరోక్ష సహకారంగా బీజేపీ, కేసీఆర్ ఉండటంతో అధికారంలోకి వచ్చాడని టీడీపీ గట్టిగా నమ్ముతుంది. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో కేసీఆర్ జగన్ కి దూరమవుతున్న తరుణంలో బీజేపీని కూడా దూరం చేయాలనేది బాబు వ్యూహం. ఇది జరగాలి అంటే బీజేపీతో, టీడీపీ జాగ్రత్తగా ఉండాలి. బిస్కట్లు వేయాలి. బీజేపీకి ఏపీలో రాజకీయంగా సాయంగా ఉండాలి. అందుకే ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో మద్దతు అన్నమాట.. ఇకపోతే ఎంపీ దుర్గా ప్రసాద్ కరోనా కారణంగా గత నెలలో మరణించడంతో తిరుపతి ఎంపీ స్థానం ఖాళీ అయింది. కాగా ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ పోటీకి బీజేపీ సై అంటుంది.

ఇక పోటీ అనివార్యం అయితే వైసిపి కూడా సిద్ధమే. ఇక జనసేన బీజేపీని కాదని సాహసం చేయదు. మరి టీడీపీ సంగతి ఏమిటీ అంటే బీజేపీకి మద్దతివ్వడమేనట. అందుకే బీజేపీ పెద్దలకు తిరుపతి ఉప ఎన్నికలో మేము పోటీ చేయం, మీరు మంచి అభ్యర్థిని పెట్టండి, మద్దతిస్తాం అని రాయబారాన్ని పంపించారట. ఇలా బాబు బీజేపీకి పెద్ద ఎర వేశారు. ఇప్పటికే బాబుతో షాకులు తిన్న బిజేపీ పెద్దలు ఆ గాలానికి చిక్కుతారో, లేదా ఎరతో పాటూ గాలన్నీ, బాబుని మింగేస్తారో వేచిచూడాలి..