చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ పార్టీని నడిపేది ఎవరు? అంటే ఇప్పట్లో ఆ ప్రశ్నకి అంత ఈజీగా సమాధానం దొరకదు. జూనియన్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే తప్ప సైకిల్ కి పడ్డ రిపేర్లు సెట్ కావన్నది కొంత మంది వాదన. చంద్రబాబు నాయుడు మరో పదేళ్ల పాటు యాక్టివ్ గా ఉండగలరు. ఎందుకంటే ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి పదేళ్ల పాటు ఆ విధమైన ఆలోచన కూడా అనవసరమన్నది ఇంకొంత మంది వాదన. ఒకవేళ ఆయన గద్దె దిగితే ఆ బాధ్యతలు లోకేష్ అలియాస్ చినబాబుకి అప్పగించే ఆలోచన కూడా ఉందన్నది మరికొంత మంది వాదన. ప్రస్తుతానికి ఆవాదనలన్నింటిని పక్కనబెడితే?
ఇప్పటివరకూ చినబాబు పార్టీ కోసం ఏదైనా చేసాడా? అంటే ఒక్కటి కూడా ఉండదు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం దగ్గర నుంచి ఇప్పటివరకూ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసింది నిజంగా గుండు సున్నా. చంద్రబాబు నాయుడు బ్రాండ్ తో కాలం వెళ్లిపోతుంది తప్ప..సింగిల్ గా వస్తే ఆయన సీనెంతో తేలిపోద్ది. అలాగని తండ్రి వారసత్వాన్ని కొనసాగించగల్గేంత ఛరిష్మా ఉన్న వాడు కూడా కాదు. ఇవన్నీ గ్రహించే లోకేష్ సంచలన సైకిల్ యాత్రకు రెడీ అవుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం లోకేష్ రాష్ర్ట వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తాడుట. వాస్తవానికి ఏడాది అమలు చేయాల్సి ఉందిట.
కానీ కరోనా రావడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే 2021 సంక్రాంతి వెళ్లిన తర్వాత సైకిల్ యాత్ర చేయాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాడుట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైకిల్ యాత్ర చంద్రబాబు నాయుడు చేయలేరు కాబట్టి ఆ బాధ్యతల్ని చినబాబు ఎత్తుకోక తప్పదు. చంద్రబాబు ఏకైక ఆశాకిరణం కాబట్టి చినబాబు ఆ మాత్రం కష్టపడితే ఎట్టోగొట్టో ప్రజల్లోనూ, పార్టీలోనూ మద్దతు కూడగట్టుకోవచ్చు అన్నది ప్లాన్ అట. చినబాబు పేరెత్తితే ఆ పార్టీలో సగం మంది సీనియర్ నేతలు బయటకొచ్చేస్తారన్నది తెలిసిందే. అందుకే ఇలా తండ్రి సలహాల మేరకు సైకిల్ గేమ్ మొదలు పెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.