టీడీపీ పరువు తీసిన చంద్రబాబు.. ఇప్పుడు నీతులు చెబుతున్నాడట.. ?

Chandrababu suggestion to Paritala family

 

నన్ను చూసి నవ్విన వాడి పళ్లు బయటపడతాయి నాకేంటి అని అనుకునే వారు సమాజంలో చాలా మందే ఉంటారు.. ఈ కోవకే టీడీపి చెందిందని అనుకుంటున్నారట.. బాబు అధికారంలో ఉన్నప్పుడు చేయవలసిన నష్టం అంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతూ అధికారపార్టీ మీద నిందలు వేయడం బాగుందా అని ప్రశ్నిస్తున్నారట వైసీపి నాయకులు.. మరో విధంగా చెప్పాలంటే ఆయన చెతకాని తనాన్ని ఆయనే ఒప్పుకుంటునట్లంటున్నారు.. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అన్నారు కానీ అది పూర్తిస్థాయిలో చేయలేక పోయారు.. ఎన్టీఆర్ గృహకల్పలో ఇళ్లు పంపిణీ చేయలేకపోయారు. నిరుద్యోగ భృతి 4 నెలల కంటే ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎన్నో కాంట్రాక్ట్ పనులు చేయించుకుని బిల్లులు ఎగ్గొట్టారట, కాని ఇప్పుడు కొత్తగా ఈ పనులన్ని మీరు పూర్తి చేయండని అంటున్నారట.

babu jagan
babu jagan

అదీగాక విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వలేకపోయాం.. మీ హయాంలో ఇచ్చేయండని పనికిమాలిన స్టేట్ మెంట్లతో తమ అసమర్థతను, చేతగానితనాన్ని, చేయలేకపోయిన పనుల్ని నీతిగా, నిజాయితీగా ఒప్పుకుంటున్నాయట టీడీపీ వర్గాలు. అధికార పార్టీని విమర్శిస్తున్నామని, టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో తమ చేతకానితనాన్ని అంగీకరిస్తున్నామనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారట. ఇలా ప్రజలకు ఏ విధమైన మేలు చేయకుండానే ఎన్నికలకు వెళ్లిన బాబు చివరకు ఘోరంగా ఓడిపోయారు.. తన ఐదేళ్ల అధికారంలో ఎన్టీఆర్ గృహకల్పలో కట్టిన ఇళ్లను ప్రజలకు పంపిణీ చేసే తీరిక కూడా లేకుండా పోయిన ఈయన తాను చేయలేని పనిని, వైసీపీ ప్రభుత్వంపై రుద్దాలని చూడటం ఎంతవరకు సమంజసం అని అంటున్నారట వైసీపీ వర్గీయులు..

ఇలాంటి మంచి పనులేవో తాను పదవిలో ఉండగా చేసుంటే పరువు దక్కేది కదా.. ఇలా ఏ పని మొదలు పెట్టినా అసంపూర్తిగా వదిలేయడం, అరకొరగా చేయడం, బాబుకి అలవాటైన పనే కదా.. ఆ స్వార్థం పరాకాష్టకు చేరడం వల్లే పదవి దూరమైంది.. తీరా వైసీపీ ఏపీనీ అభివృద్ధిలోకి తీసుకెళుతుంటే దొంగ ఏడుపొకటి. ఆ ఏడుపులోనే టీడీపీ చేతకానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారట. తనకు తానుగానే నోరు తెరచి టీడీపీ పరువును తీసుకుంటూ పైగా నీతులు వల్లిస్తున్నారని ఏపీలో ప్రచారం జరుగుతుందట..