బ్రేకింగ్ : ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ఓపెన్ !

schools reopen in andhra pradesh with union government guideliness

తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ కానున్నాయి. ఈ రోజు మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9వ తరగతి, ఆ పైబడిన తరగతుల నిర్వహణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కట్టడి కోసం గతేడాది మార్చిలో లాక్‌ డౌన్ విధించిన నాటి నుంచి విద్యాసంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్ ‌లైన్ ద్వారా విద్యాబోధన జరుగుతోంది.

AP Government to provide free uniform to 9th, 10th class students

కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతోపాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో ఇతర రాష్ట్రాల తరహాలోనే విద్యాసంస్థలను తిరిగి తెరవడానికి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లతో జరుగుతోన్న ఈ భేటీలో విద్యా, రెవెన్యూ సంబంధిత అంశాలతోపాటు కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, 2021-22 బడ్జెట్ సమావేశాలు తదితర అంశాల గురించి చర్చ జరగనుంది.