Home Andhra Pradesh అమరావతి రాజధాని అనడం వెనక ఉన్న చంద్రబాబు కుట్ర ఇదేనట.. నిజం బయటపెట్టిన బొత్స.. ??

అమరావతి రాజధాని అనడం వెనక ఉన్న చంద్రబాబు కుట్ర ఇదేనట.. నిజం బయటపెట్టిన బొత్స.. ??

 

ఏపీలో టీడీపీ పరిస్దితి కుడితిలో పడ్ద ఎలుకగా మారిందంటున్నారు.. తెలుగుదేశం పార్టీ అధినేత ఏం మాట్లాడిన అది సంచలనమే అవుతుందట.. ఆయన మాటల వెనక మర్మం కేవలం ఆయనకు మాత్రమే పనికి వచ్చేలా ఉంటుందనే ఆరోపణలు లేకపోలేదు.. ఇప్పటికే ఎంపి విజయ సాయిరెడ్ది బాబు అండ్ కోనూ కూరలో కరివేపాకులా తీసిపడేస్తుండగా, పెట్రోల్ అయిపోయిన బండిలా ఉన్న లోకేశ్ వాటికి సమాధానాలు చెప్పడం రాక తడబడటం అందరికి తెలిసిందే.. అదీగాక అవినీతి బురదలో కూరుకుపోయిన బాబు చెరువులో చాపల కోసం కొంగ దొంగ జపం చేసినట్లుగా అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ..Botsa Vs Babu | Telugu Rajyam

ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని.. కేవలం చంద్రబాబు, అతని పెయిడ్ అర్టిస్టులు మాత్రమే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు.. ఇకపోతే రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.. ఇక బాబు పాలనలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రంగు రంగుల రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు. కానీ వైసీపీ ప్రజల ప్రభుత్వమని.. ఏపీ అభివృద్ధినే ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ పనిచేస్తున్నారంటూ తెలియచేశారు..

ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకనే, జరుగుతున్న అభివృద్ధిని జీర్ణం చేసుకోలేక వాళ్ల అక్కసును వెళ్ళగక్కే నాయకులు త్వరలోనే నోరు మూతవేసుకునే రోజులు వస్తాయంటు ఈ సందర్భంగా వెల్లడించారు.. ఇకపోతే విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్‌ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇదేకాకుండా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలో ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ప్రజలు మాత్రం ఇదన్న మాట చంద్రబాబు అమరావతి రాజధాని అనడం వెనక ఉన్న కుట్ర అని అనుకుంటున్నారట..

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

Related Posts

Latest News