టీడీపీ వైసీపీల కంటే దారుణంగా ఏపీ బీజేపీలో కుల గొడవలు

BJP Stands Clear With Ram Madhav Comments

Somu Veerraju

రాజకీయాలంటేనే కులాలు, మతాలు. కులం, మతం లేని రాజకీయాలను ఇప్పుడే చూడలేము. ఏపీ రాజకీయాల్లో కమ్మ, కాపు కులాలు ఆధిపత్యం చేలాయిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ చాలా ధీన స్థితిలో ఉంది. 2024 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ విషయాన్ని గమనించిన టీడీపీలో కమ్మ నాయకులు పార్టీ మార్చడానికి రెడిగా ఉన్నారు. ఇలా మరాలని ఎదురు చూస్తున్న కమ్మ నాయకులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారు. అయితే ఆ పార్టీలో ఇప్పటికే కాపు నాయకులు అధికారం చెలాయిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చాక కమ్మ నేతల పరపతి పనిచేయడం లేదన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అందుకే సోముకు వీరంతా ముఖం చాటేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు.

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సొము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీలో ఉన్న హేమాహేమీలు రాలేదు. కామినేని శ్రీనివాస్ మాజీ ఎంపీ హరిబాబు మరియు సుజనాచౌదరి లాంటి బీజేపీ కీలక నేతలు ముఖం చాటేశారు. గ్రౌండ్ లెవల్లో బలం లేని సోమును పార్టీ అధ్యక్షుడిగా నియమించడంపై బీజేపీలోని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి బలం తగ్గడం వల్లే బీజేపీకి రాష్ట్రంలో కొంచెం మైలేజ్ పెరిగిందనే విషయాన్ని బీజేపీ నాయకులు కూడా అంగీకరిస్తారు. అయితే పార్టీ పుంజుకుంటున్న ప్రారంభ దశలోనే ఈ కుల పోరు పార్టీలో మొదలైతే రానున్న రోజుల్లో బీజేపీకి కష్టాలు తప్పవు. టీడీపీ, వైసీపీలో ఉన్న కుల పోరు కంటే కూడా బీజేపీలో ప్రస్తుతం ఉన్న కుల పోరు ఎక్కువగా ఉంది.

తమ పార్టీని అందరూ కలిసి గ్రౌండ్ లెవెల్ లో బలపరచుకోవలసిన నాయకులు ఇలా కులం పేరుతో కొట్టుకోవడం, కులం పేరుతో ఆధిపత్యం కోసం ఆరాటపడటం ఏంటని బీజేపీ అధిష్టానం నుండి సలహా వచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీలో అధికారి మాటలకు విలువ ఇవ్వకపోయినా, పార్టీ అధినేతకు విలువ ఇవ్వకపోయినా వాళ్ళను ఎలా దారిలోకి తీసుకురావాలో బీజేపీ పెద్దలకు తెలుసని, టీడీపీ ముందు జాగ్రత్త పడి తమ పార్టీకి చెందిన కమ్మ నేతలను కపడుకోకపోతే రానున్న రోజులో టీడీపీకి ఏపీలో కూడా భవిష్యత్తు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.