ఏపీ:అమరావతి విషయంలో బీజేపీ వైఖరి భిన్నంగా ఉంది. నిన్నటి వరకు అమరావతినే రాజధానిగా నియమించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో రాజధాని విషయంలో మేము జోక్యం చూస్కోలేమని నిన్న కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది.దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా తమ వైఖరిని వెంటనే మార్చుకొని చంద్రబాబు హయాంలో అమరావతిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత పీవీఎస్ శర్మ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసిన ఉన్న బీజేపీ ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చి, టీడీపీపైనే దర్యాప్తుకు డిమాండ్ చేయడంతో టీడీపీ నాయకులు ఖంగుతిన్నారు. టీడీపీ నాయకులకు సంబంధించిన మీడియా వర్గానికి కూడా భూములు ఇచ్చారని, వారిపై కూడా దర్యాప్తు జరపాలని వైసీపీని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ చర్యలు వల్ల టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా నాయకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అయితే 2014లో కుంభకోణం జరిగి ఉంటే అప్పుడు బీజేపీ కూడా టీడీపీతో కలిసి ఉంది కాబట్టి బీజేపీకి కూడా సంబంధం ఉందా అని రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. తాము ఒకవేళ తప్పు చేస్తుంటే అప్పుడు తమతో ఉన్న బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నిత్యం తన వైఖరిని మార్చుకుంటేనే ఉంటుందని, అందుకే ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మాట మార్చిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా నాయకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ భూముల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమతో కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా వైఖరిని మార్చడంతో తెదేపా నాయకులు, ఎల్లో మీడియా అధినేతలు తమ కథ త్వరలో క్లైమాక్స్ కు చేరనుందా అని భయపడుతున్నారు.