అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ…కోర్టుల్లో అడ్డంగా బుక్ చేస్తున్నారు. వీటిపై అధికార పక్షం నేతలు అంతే సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు పెరెత్తితేనే మండిపడే వైకాపా నాయకుల్లో సజ్జల మరీ అంత యాక్టివ్ కాదు. అవసరం మేర స్పందిస్తారు. అవసరం అనుకుంటేనే మాట్లాడుతున్నారు..ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తారు.
ఆయన క్రిటిసిజంలో ఓ అర్ధం ఉంటుంది. తాజాగా రాష్ర్టంలో ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయిది చంద్రబాబు గారు..కానీ మీరు గెలిచిన 23 చోట్లా కూడా మీ పేరు చెబితే ప్రజలు భగ్గుమంటున్నారు. అలాంటి మీరు అమరావతి పై దొంగ పోల్స్ పెడుతున్నారు. మీ టీవీలు.. పేపర్లు..వెబ్ సైట్లో పెట్టే ఫలితాలు ఎలా వస్తాయో రాష్ర్టంలోని ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేసారు.రాజకీయంగా చివరి దశలో ఉన్న మీరు ఇకనైనా కళ్లు తెరవాలని సూచించారు. కుతంత్ర రాజకీయాలు మానేసి వాస్తవాలు గ్రహించాలని సూచించారు. విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్నిచిమ్మొద్దన్నారు.
అమరావతి సహా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది పరిచే ఐడియాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని సూచించారు. మడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం నవ రాజకీయాలకు ఎంతో అవసరమని అన్నారు. మరి దీనిపై పచ్చ తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో. కాగా సజ్జల తాజా కామెంట్స్ ఏపీ ప్రజల్లో హాట్ టాపిక్ గామారాయి. మరి చంద్రబాబు దొంగ పోల్స్ వెనుక అంతరార్ధం ఏంటి? సజ్జల కౌంటర్ వెనుక కారణం ఏమై ఉంటుంది? వంటి అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాలు సహా ప్రజల్లో వాడి వేడి చర్చకు దారి తీస్తున్నాయి.