Belly Fat: పొట్ట తగ్గాలంటే డైట్ లో ఈ ఫుడ్ తప్పనిసరి..! ట్రై చేయండి..

Belly Fat: పొట్ట పెరుగుతుంటే దానంత పెద్ద సమస్య మరేదీ కనిపించదు. మనిషి అందంగా ఉన్నా పెరిగిన పొట్ట ముందు అందం చిన్నబోతుంది. పొట్ట తగ్గించాలనే తాపత్రయంకు తగ్గట్టు వ్యాయామాలు చేయాలంటే కొందరికి కష్టమైన పని. కొందరు ఎన్ని ఎక్సర్‌సైజులు, వర్కవుట్లు చేసినా పొట్ట సమస్య మాత్రం తీరదు. దీంతో పొట్టలో పేరుకున్న కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో కసరత్తులు చేయాలి.. పొట్టలో కొవ్వు కరిగేందుకు కొన్నిరకాల ఆహార పదార్ధాలు కూడా తీసుకోవాలి.

పొట్టను తగ్గించడంలో ఉలవలు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల పొట్ట తగ్గిపోతుంది. పప్పుల్ని రకరకాలుగా వండుకుంటాం. కొందరు చికెన్, మటన్ లో కూడా పప్పుల్ని కలిపి వండుతారు. ఉలవచారు, బిర్యానీ.. ఆ కోవలోకే చెందుతుంది. ముద్దపప్పు, నెయ్యి కలుపుకున్న అన్నం టేస్ట్ తెలిసిందే. మంచి పోషకాలు, ఫైబర్ కూడా ఎక్కువున్న పెసరపప్పుతో అరుగుదల బాగుంటుంది. ఇది బరువు చక్కగా తగ్గిస్తుంది. పొట్టను కూడా తగ్గిస్తుంది.

ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల బరువు తగ్గడమే కాదు పొట్ట కూడా తగ్గుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు వీటిలో ఉన్నాయి. పొట్టలో కొవ్వుపై ఉలవలు చాలా ప్రభావం చూపిస్తాయి. కొవ్వు తగ్గేలా చేస్తాయి. ఫలితంగా పొట్ట తగ్గి కనపడుతుంది. అంతేకాదు.. కిడ్నీలో రాళ్లను కూడా పోగొడుతుంది. అందుకే ఉలవలు కొందరికి చాలా ఇష్టమైన ఫుడ్. ఉలవచారు బిర్యానీ అందుకే అంత ఫేమస్. 

ఎర్రపప్పును కాస్త తక్కువగానే వండుకుంటాం. కానీ ఈ పప్పు చాలా మంచిది. శరీరానికి అవసరమైన మంచి కార్బోహైడ్రేట్స్ దీనిలో ఉంటాయి. ఈ పప్పులో కొవ్వు తక్కువ.. ఫైబర్ ఎక్కువ ఉండటంతో ఈజీగా జీర్ణం అవుతుంది కూడా. ఫైబర్ వల్ల పప్పు తిన్నాక పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. అందువల్ల అధిక బరువు సమస్య తగ్గడమే కాదు.. పొట్ట కూడా తగ్గిస్తుంది. వారానికి రెండుసార్లు ఎర్రపప్పు వండుకొని తింటే పొట్టలో కొవ్వు కరిగేలా చేస్తుంది. అయితే.. వీటితోపాటు కొద్దిగా వ్యాయామం చేస్తే పొట్ట తగ్గడంతోపాటు ఆరోగ్యం కూడా దరి చేరుతుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.