మనలో చాలామంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలని సూచిస్తే ఈ జ్యూస్ కూడా తాగుతారా అనే సందేహాలను వ్యక్తం చేస్తారు. అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సాధారణంగా దిష్టి తీయడానికి వడియాల కోసం, స్వీట్ కోసం బూడిద గుమ్మడికాయను ఎక్కువగా వినియోగిస్తారు. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో బూడిద గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించాలని భావించే వాళ్లు ఈ జ్యూస్ పై దృష్టి పెడితే మంచిది.
పరగడుపున బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుండటం గమనార్హం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యులు ఈ జ్యూస్ ను ఆయుర్వేద పానీయం అని అంటారు. కాలేయం, పొట్ట, చర్మ సమస్యలతో బాధ పడేవాళ్లకు ఇది దివ్యౌషధం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఈ జ్యూస్ రుచిగా లేకపోయినా ఆరోగ్య ప్రయోజనాలను అందించే విషయంలో ఈ జ్యూస్ కు మరే జ్యూస్ సాటిరాదు. సహజంగా శక్తిని ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బయో యాక్టివ్ న్యూట్రియంట్స్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. జింక్, కాల్షియం, బీ విటమిన్లు, విటమిన్ సి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఇందులో ఉండే ప్రో బయోటిక్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంపొందించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమసలతో బాధ పడేవాళ్లు ఈ జ్యూస్ తీసుకోవాలి. ఇందులో యాంటీ జియోలైటిక్ లక్షణాలు ఉండగా ఇది నాడీ వ్యవస్థకు మంచిదని చెప్పవచ్చు. ఆస్తమా రోగులు, గర్భిణీ స్త్రీలు, జ్వరంతో ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకోకూడదు.