Beauty Tips: కాఫీ పొడితో అందమైన మెరిసే చర్మంమీ సొంతం..!

Beauty Tips: చాలా మంది అందంగా కనిపించాలని చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ, మార్కెట్లో లభించే పరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. చర్మ సౌందర్యం మెరిపించటంలో కాఫీ స్ర్కబ్ ఎంతో సహాయ పడుతుంది. కాఫీ పౌడర్ ఉపయోగించి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం వల్ల నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది. కాఫీ పౌడర్ చర్మం నిగారింపు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాతావరణ కాలుష్యం వల్ల మొఖం మీద దుమ్ము ధూళి కణాలు పేరుకుపోయి ఉంటాయి. కాఫీ పౌడర్ చర్మానికి ఒక స్క్రబ్బర్ లాగా బాగా పనిచేస్తుంది. ఒక కప్పులో కొంచెం కాఫీ పౌడర్, శనగపిండి, పెరుగు సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగి స్ర్కబ్ చేస్తూ శుభ్రం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మొహం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి మొటిమలు మచ్చలు తగ్గుతాయి.

ఒక కప్పు లో కొంచెం కాఫీ పౌడర్, కొంచెం బ్రౌన్ షుగర్, రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి అంటించి మూడు లేదా నాలుగు నిమిషాలపాటు వెళ్లగా వృత్తాకారంలో మొహం మీద, మెడమీద రుద్దుతూ స్ర్కబ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి చేయడం వల్ల చర్మం మీద ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.