ప్రభాస్ ఫ్యాన్స్ ని చేదు వార్త అందించిన మేకర్స్.. అందాక ఆశలు వదులుకోవాల్సిందే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు కొన్ని ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ప్రస్తుతం కొన్ని సెట్స్ మీద ఉండగా ఓ సినిమా రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాల్లో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ ఏక్షన్ డ్రామా “సలార్” కూడా ఒకటి కాగా ఈ సినిమాపై అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి అందాక చేదు వార్తే మిగిలింది అని చెప్పాలి.

గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా మాస్ టీజర్ కోసం ఎన్నో అంచనాలు పెట్టికొని ఎదురు చూస్తుండగా ఈ సినిమా నిర్మాత విజయ్ కలైందిగర్ ఇచ్చిన క్లారిటీ డార్లింగ్ ఫాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. తాము ఈ నెలలో సలార్ టీజర్ రిలీజ్ చేస్తామని ప్లాన్ చేసింది నిజమే కానీ ప్రస్తుతం అయితే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ కూడా రావడం లేదని దాన్ని తర్వాత ఎప్పుడైనా మంచి సమయం చూసి రివీల్ చేస్తామని తెలిపారు.

దీనితో ఈ క్లారిటీ తో అభిమానులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఇంకా ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మళయాళ నటుడు పృథ్వి రాజ్ కీలక పాత్ర చేసే అవకాశం ఉంది. అలాగే రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వాళ్లు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.