Health Tips: కాఫీ టీ తాగే టప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే…!

Health Tips: చదరంగా చాలామంది ఉదయం లేవగానే కాఫీ, టీ తాగనిదే వారి రోజు మొదలు పెట్టారు. చాలామంది కి కాఫీ, టీ తాగేటప్పుడు బ్రెడ్, బిస్కెట్స్, రస్క్ లు తినే అలవాటు ఉంటుంది. ఇలా ప్రతి రోజూ కాఫీ, టీ తాగేటప్పుడు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటు మార్చుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ, టీ తో పాటు బిస్కెట్లు తినటం వలన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.కాఫీ, తాగే టప్పుడు బిస్కెట్లు తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా బిస్కెట్ల తయారీలో మైదాపిండిని ఉపయోగిస్తారు. మైదా పిండి ని వైట్ పాయిజన్ అని కూడా అంటారు.ఎక్కువ మోతాదులో మైదా పిండి తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్లను రీఫైండ్ పిండితో తయారు చేయటం వల్ల వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండదు. అందువల్ల మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

థైరాయిడ్, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు బిస్కెట్లు తినకపోవడం మంచిది. బిస్కెట్ల లో అధికశాతం షుగర్ ఉండటం వల్ల ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తాయి. అంతేకాకుండా బిస్కెట్ల లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బిస్కెట్లు తినటం వల్ల వారి సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.బీహెచ్‌టీ పేరున్న రెండు ప్రిజర్వటివేస్ కలిపి బిస్కెట్లు తయారు చేస్తారు. ప్రతిరోజు బిస్కెట్లు తినటం వల్ల వాళ్ళకి ఉన్న ఎనామిల్ దెబ్బతిని దంతాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వికెట్లకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.