Fatty Liver: ప్రస్తుతం అందరిని ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పులు రావటం, శారీరక శ్రమ లేకపోవడం,ఉబకాయం వంటి సమస్యల కారణంగా ఈ ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్న వారిలో లివర్ లో వ్యర్థ పదార్థాలు పెరిగిపోయి మలబద్దకం, అజీర్తి, లవర్ సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ముఖ్యంగా రార్త్రిర్ 6 నుండి 7 గంటల సమయంలో భోజనం చేయటం వల్ల పడుకునే సమయానికి తిన్న ఆహారం జీర్ణమవుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు రాత్రి సమయంలో భోజనానికి తొందరగా జీర్ణమయ్యే పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభించక లివర్ లో ఉన్న కొవ్వు కరిగిస్తుంది.
ఈ సమస్యతో బాధపడే వారు వారానికి రెండు రోజులు తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగి వేరే ఏ ఇతర ఆహార పదార్థాలు తినకుండా ఉండాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల లివర్ లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోయి ఈ సమస్య తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు అప్పుడప్పుడు ఆహారం తినకుండా ఉపవాసం చేయడం వల్ల కూడా ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ఫ్యాటి లివర్ సమస్యతో బాధపడేవారు రౌడీ అధికంగా ఉండే పాలు పాల సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడేవారు మధ్యానికి కూడా దూరంగా ఉండాలి.