బెల్లం ఆరోగ్యానికి మంచిదని టీలో కలిపి తాగుతున్నారా..? జాగ్రత్త ఈ సమస్యలు తప్పవు..?

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి అందరిని ఇబ్బంది పెడుతోంది. అందువల్ల చాలామంది చక్కెరకు బదులు ఆరోగ్యానికి మంచిదని బెల్లం ఎక్కువగా వాడుతూ ఉంటారు. బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. చక్కెరకు బదులు బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. చాలామంది కాపీ టీలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగకపోతే చాలామందికి రోజు గడవదు. అయితే చాలామంది కాఫీ టీలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం పాలు బెల్లం, కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెల్లం కలిపిన పాలు, బెల్లంతో తయారుచేసిన కాఫీ టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రభావం ఉంటుంది. ఇలా కాఫీ టీ లలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.

సాధారణంగా ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించి ఉత్సాహంగా పనిచేస్తారు. కానీ బెల్లంతో తయారుచేసిన టీ తాగటం వల్ల శరీరంలో శక్తి నశించి అలసటగా అనిపిస్తుంది. టీలో కలిపిన బెల్లం శరీరంలో శక్తిని నశింపజేస్తుంది. అంతేకాకుండా పాలు టీ వంటి వేడి పదార్థాలలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల పాలు టి చల్లారిన తర్వాత కూడా బెల్లం వేడిగా ఉంటుంది. ఇలా చల్లటి వేడి పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.