Health Tips: ప్రస్తుత జనరేషన్ లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చిన్న వయసులో నుంచి ముఖము పై ముడతలు ఏర్పడుతున్నాయి. అయితే ఇందుకు గల కారణాలు ఆహారపు అలవాట్లు, జీవన విధానం, కాలుష్య వాతావరణం ఇలా చాలా కారణాల వల్ల ఈ ముడతలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ ముడతల తన వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ముడతలను తగ్గించుకోవడానికి మార్కెట్ లో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడటం కంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ముడతల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మరి ముడతల సమస్య లను చెక్ పెట్టడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ముడతల సమస్యలకు చెక్ పెట్టడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది. బాదం నూనెలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల, అవి ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ బాదం నూనెను తరచుగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలను తగ్గడంతో పాటు ముఖం కాంతివంతంగా ఉంటుంది. బాదం లోనే ఉపయోగించడం వల్ల చర్మం పై ఉన్న పాత మచ్చలు తొలగుతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,జింక్ వంటి కొన్ని ప్రత్యేక పోషకాలు ఉన్నాయి.
ఇవి చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక కాటన్ లో కొన్ని చుక్కల బాదం నూనె వేసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ మొటిమలను తగ్గించడంలోనూ బాగా ఉపయోగపడుతాయి. అదే విధంగా చాలా సార్లు నిద్రలేకపోవడం, ఒత్తిడి తీసుకోవడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు రాత్రి పడుకునే సమయంలో బాదం నూనెలో కొద్దిగా రోజ్ వాటర్ లేకపోతే తేనే కలిపి రాసుకోవడం వల్ల ఆ నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. అలాగే బాదం నూనెలో కొబ్బరి నూనె అలోవెరా జెల్ ని కలిపి అప్లై చేయడం వల్ల ముడతలు త్వరగా తొలగించుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను చర్మానికి రాకపోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా ముఖాన్ని కడిగి ఆరిన తర్వాత చేతులపై కొన్ని చుక్కల బాదం నూనె వేసుకొని ముఖానికి పట్టించి, తరువాత తేలికపాటి మసాజ్ చేయాలి. అయితే ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కొంచెం ఆలస్యం అయినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.