జగన్ ఇలాంటివి నువ్వు సపోర్ట్ చేస్తే .. ఓటమి కి సిద్ధంగా ఉండాల్సిందే ! 

 

కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఓ సన్సేషన్. ఎందుకంటే వరుసగా నాలుగుసార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగిన కొడాలి నాని 20 ఏళ్లుగా గుడివాడ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు.. అసలు కొడాలి నాని రాజకీయ ప్రస్దానం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. ఈయన దివంగత సీఎం ఎన్టీఆర్ కు పిచ్చి అభిమాని మాత్రమే కాదు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణను తన రాజకీయ గురువుగా చెప్తుంటారు. ఇక 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైయస్ జగన్ వెంట నడిచారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడు అనే పేరును తెచ్చుకున్నాడు.. అయితే ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే నానికి ఆ దూకుడే ఇప్పుడు కొంపముంచేలా ఉంది..

తాజాగా ఏపీలో జరిగిన మతపరమైన ఘటనలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే.. ఇక్కడ జరిగే రాజకీయ చదరంగంలో సీఎం జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు అంతర్వేది ఘటనను, తిరుమల డిక్లరేషన్ వ్యవహారాన్ని పావుగా వాడుకుని జగన్ ని కార్నర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ అంతర్వేది వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయడంతో బంతి కేంద్రం కోర్టులో పడగా, డిక్లరేషన్ వ్యవహారంలో ఎంత గొడవ చేసినా ఫలితం కనిపించలేదు. ప్రజలెవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు, పైగా చంద్రబాబుపైనే తీవ్ర విమర్శలు చెలరేగాయి.. ఇక ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన నాని పదే పదే తమపై విమర్శలు చేస్తున్న టీడీపి నాయకులను విమర్శించే క్రమంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం అసంతృప్తిని వెలిబుచ్చింది..

ఇక ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే వార్త తెరపైకి తెచ్చింది.. ఈ క్రమంలో ఈ దుమారం పై స్పందించిన నాని, చంద్రబాబు ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆదిత్యనాథ్ పేర్లను తెరపైకి తెచ్చారు. దీంతో ఆరిపోతుందనుకున్న వివాదం మరింత రాజుకుంది.. అసలు ప్రధాని నరేంద్ర మోదీ ని ఈ వ్యవహారంలో కి ఎందుకు లాగాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఒక వైపు జగన్, బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, నాని వ్యాఖ్యలతో బీజేపీ, వైసీపి ల మధ్య ఈ దుమారం మరింత దూరం పెంచేలా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వ్యవహారం ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో, సీయం పదవికే ముప్పు తెస్తుందో తెలియదు గానీ వైఎస్ జగన్ ఇలాంటి విషయాలను మాత్రం సపోర్ట్ చేయడం సరికాదని అనుకుంటున్నారట ప్రజలు..