ఆంధ్రా నాయకుల రాజకీయాలను తట్టుకోలేక, వివక్షకు బలవ్వలేక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని కేసీఆర్ అంటుంటారు. అంతా ఆంధ్రోళ్లే దోచుకు తింటూ తమను అభివృద్దికి ఆమడ దూరం విసిరేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేవారు. రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ఏర్పడింది అయినా తెరాస నేతలు ఆంధ్రా నాయకులవైపు, రాజకీయాల వైపు వేలెత్తి చూపడం మానలేదు. బీజేపీ అంటే కేసీఆర్ కు పడదు. బీజేపీ అనే కాదు కేంద్రంలో ఎవరున్నా ఆయనకు గిట్టదు. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీలో అడుగుపెట్టాలనేదే ఆయన కోరిక. అందుకే బీజేపీ యడబాటును మైంటైన్ చేస్తున్నారు. తమవైన కారణాలు చూపుతూ బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటారు.
ఆయన వ్యతిరేకించడం వరకు బాగానే ఉంది. కానీ తనతో పాటు పక్క రాష్ట్రం ఏపీ కూడ మోదీ మీదకు తిరగబడాలని అన్నట్టు ఉంటుంది ఒక్కోసారి తెరాస వ్యవహారం. తాజాగా కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టం, రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించగా జగన్ ఆమోదించారు. అలా ఆమోదించినందుకు కానూ కేంద్రం ఏపీకి 4000 కోట్ల నిధులు ఇచ్చింది. ఇదే ఆఫర్ తెలంగాణకు కూడ ఇచ్చింది. కానీ అమౌంట్ కొంచెం తక్కువ. అయితే ఆ ఆఫర్ ను కేసీఆర్ తిప్పికొట్టారు. ఒక సందర్భంలో ఈ మీటర్లకు మోటార్ల టాపిక్ మాట్లాడిన తెరాస మంత్రి, ముఖ్యనేత హరీష రావు ఏపీ సీఎం జగన్ 4000 కోట్లు తీసుకుని కేంద్రం నిర్ణయానికి తలూపారు అంటూ ఏదో జగన్ జేబులో మోదీ డబ్బు వేసినట్టు మాట్లాడారు. ఇది వైసీపీ శ్రేణులకు అస్సలు నచ్చలేదు. హరీష్ రావు మాటలకు గట్టిగా సమాధానం ఇవ్వాలాని నేతలను కోరారు. కానీ వైసీపీ లీడర్లు కేసీఆర్ తో ఉన్న స్నేహ బంధాన్ని దృష్టిలో ఉంచుకుని మౌనంగానే ఉన్నారు. కానీ తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందిస్తూ రైతుల ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో
కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని చెబుతూ కేంద్రం ఇచ్చే 4000 కోట్ల రూపాయల నిధులు అభివృద్ధికి ఉపయోగిస్తామే కానీ మా జేబుల్లో వేసుకోం. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలి ‘ అంటూ కౌంటర్ వేశారు. గతంలో కూడ తెరాస నేతలు పలువురు అనేక విషయాల్లో ఏపీకి, తెలంగాణకు పోలిక పెడుతూ ఎన్నో అన్నారు. అయితే ఆంధ్రా నేతల నుండి సమాధానం వెళ్లలేదు. ఈవెన్ జగన్ కూడ గతంలో స్పందించాల్సిన సంధర్భాల్లో స్పందించలేదు. కానీ ఇప్పుడు హరీష రావుకు మాత్రం గట్టి పంచ్ ఇచ్చారు.