ఏపీలో సీఎం జగన్.. వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ప్రారంభించి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కాకముందు ఏ మాట అయితే ఇచ్చారో.. అదే మాట మీద నిలబడి రోజురోజుకూ తన గొప్పదనాన్ని పెంచుకుంటూ పోతున్నారు జగన్.
తాజాగా పేదింటి ఆడపిల్లల కోసం బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా పేదింట్లో ఆడపిల్లలంటేనే చాలు.. వాళ్ల పెళ్లి కోసం డబ్బు లేక తల్లిదండ్రులు ఎన్నో అవస్థలు పడుతుంటారు. అటువంటి ఆడపిల్లలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో సీఎం జగన్.. వైఎస్సార్ పెళ్లి కానుక అనే పథకానికి రూపకల్పన చేశారు.
ఈ పథకాన్ని ఇదివరకే ప్రారంభించినా.. దానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. పేదింటి ఆడపిల్లలు తమ పెళ్లి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
పెళ్లికి ముందే ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. పెళ్లి ఖర్చుల నిమిత్తం 20 శాతం డబ్బును ముందే పెళ్లి కూతురు అకౌంట్ లో వేస్తారు. మిగితా డబ్బును పెళ్లి తర్వాత పెళ్లి కూతురు అకౌంట్ లో వేస్తారు.
వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ప్రకారం ఎస్సీ ఆడబిడ్డలకు 40 వేలు, ఒకవేళ కులాంతర వివాహం అయితే 75 వేలు, ఎస్టీ కులం అయితే 50 వేలు, ఎస్టీ కులాంతర వివాహం అయితే 75 వేలు, బీసీ అయితే 35 వు, బీసీ కులాంతర వివాహం చేసుకుంటే 50 వేలు, మైనార్టీ ఆడబిడ్డలకు 50 వేలు, దివ్యాంగ ఆడబిడ్డలయితే లక్ష రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందించనుంది.