కృష్ణా నీటి లిప్టుపై ఏపీ సీఎం జ‌గ‌న్ వివ‌ర‌ణ‌

YS Jagan compromise to reduce liquor rates 

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటిని లిప్టు చేస్తూ కొత్త ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యించ డం తీవ్ర అభ్యంత‌ర‌క‌మ‌ని తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించ‌డం తెలిసిందే. ఈ విష‌యంలో సుప్రీం కోర్టుకైనా వెళ్తామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. అటుపై ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ఏపీ చెప్పేది..ఒక‌టి చేసేది మ‌రోక‌ట‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో కేంద్రం రెండు రాష్ర్ట ప్ర‌భుత్వాల‌తో నాట‌కాలాడుతుంద‌ని తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. అటు తెలంగాణ‌లో ప్ర‌తి ప‌క్షాలు ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డ్డాయి. తాజాగా ఈ వివాదంపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గన్మోహ‌న్ రెడ్డి స్పందించారు.

రాష్ర్టానికి కేటాయించిన నీటిని మాత్ర‌మే తాము వాడుకుంటున్నామ‌ని క్లారిటీ ఇచ్చారు. రాయ‌ల‌సీమ స‌హా నెల్లూరు, ప్ర‌కాశం వంటి ప్రాంతాల్లో తాగ‌డానికి నీళ్లు లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎవ‌రైనా మాన‌వ‌తా దృక్ఫ‌ధంతో ఆలోచించాలి. కేటాయింపులు దాటి ఏ రాష్ర్టం కూడా అద‌నంగా నీటిని వినియోగించుకోదు. కృష్ణా బోర్డు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేసి నీటి కేటాయింపులు చేస్తుంది. ఫ‌రిది దాటి తీసుకోవ‌డానికి బోర్డు ఒప్పుకోదు. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్న‌ప్పుడే 44 వేల క్యుసెక్కులు నీటిని తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ స్థాయి నీటి మ‌ట్టం ప‌ది రోజుల‌కు మించి ఉండ‌దు. ఆ రోజుల్లోనే రాల‌య‌సీమ‌, నెల్లూరు ప్రాంతాల‌కు నీటిని త‌ర‌లించాలి. ఆ త‌ర్వాత మ‌ట్టం త‌గ్గితే చుక్క నీకు కూడా బ‌య‌ట‌కు రాదు.

తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్ట్ లు చూస్తే మ‌రోలా ఉంటుంది. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ ద్వారా నీటిని త‌ర‌లించ‌వచ్చు. శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో కూడా నీటిని వాళ్లు త‌ర‌లించుకోవ‌చ్చు. రోజుకు 2 టీఎంసీలు మేర 90 టీఎంసీల నీటిని త‌ర‌లిస్తున్నారు. క‌ల్వ‌కుర్తిఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ ద్వారా మ‌రో 40 టీఎంఎంసీల నీటిని త‌ర‌లిస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ తెలంగాణ ప్ర‌భుత్వానికి వివ‌ర‌ణ ఇచ్చారు. ఇప్ప‌టికే ఏపీ నీటిని త‌ర‌లిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.