తెలంగాణ సీయం కేసీయర్ చాలా అదృష్టవంతుడని చెప్పుకోవచ్చూ.. ఇక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే రాజ్యాంగం.. ఎందుకంటే అసలు బలమైన ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నాడు.. టీడీపీని సమూలంగా నాశనం చేశారు.. ఇక కాంగ్రెస్ ఎన్ని కుప్పిగంతులు వేస్తున్న కెసీయార్ ఎత్తుల మీద చిత్తెపోతుంది.. ఈ దశలో బీజేపీ కూడా ఇంకా కారు స్పీడ్ అందుకోలేక చతికిల పడుతుంది.. కానీ ఏపీలో అలా కాదు.. వైసీపీకి పోటాపోటీగా టీడీపీ ఎత్తులు వేస్తుంది.. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినాక ఉపయోగించినంతగా ఎప్పుడు ఊపయోగించలేదనే విషయం ఇప్పటికే ఏపీ ప్రజలకు అర్ధం అయ్యిపోయిందట..
ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ టార్గెట్ వైసీపీ అని సృష్టంగా తెలుస్తుందట.. అందుకే ఈ పదిహేను నెలల్లో వైసీపీ చేసిన ఏదో ఒక అవినీతిని నిరూపించాలని, కనీసం ఒక మంత్రినైనా జగన్ మంత్రి వర్గం నుంచి తప్పించగలిగితే సగం విజయం సాధించినట్లేనని విశ్వసిస్తుందట. ఇలా చేయగలిగితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కొంత వరకూ సడలించగలుగుతామని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. అందులో భాగంగానే మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిని రోజుకొకకటి చొప్పును బయపెడుతున్నారట.
ఇక ఈ టాస్క్ ను టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో భూవివాదాన్ని అయ్యన్న పాత్రుడు తెరపైకి తెచ్చారు. మంత్రి అయిన తర్వాతనే జయరాం ఈ భూదందాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇలా రహస్యంగా టీడీపీ గూడుపుఠాని చేస్తూ వైసీపీని బద్నాం చేసే పనిలో భాగంగా ఒక్క మంత్రిని అయినా కేబినెట్ నుంచి తప్పిస్తే సక్సెస్ అయినట్లే అనే భ్రమలో ఉన్నారట.. మరి వీరి ఆశ ఎంతవరకు తీరుతుందో చూడాలి..