Allu Family Vs Mega Family : సినీ వర్గాల్లో ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీ దొరుకుతుందా అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చూపించే అత్యుత్సాహం అయితే అంతా ఇంతా ఉండదు. అది ఏ హీరో అయినా కూడా స్టేట్ లో ఇంకో సమస్య లేదు అన్నట్టు వాళ్ళవే చూపిస్తారు. మరి అలానే రీసెంట్ గా సినీ వర్గాల్లో సహా మీడియాలో సంచలనంగా మారిన అంశం ఒకటి ఉంది.
అదే అల్లు ఫామిలీ మరియు మెగా ఫ్యామిలీ లకు పెట్టిన కోల్డ్ వార్. దీనిని కొంతమంది సృష్టించారు అని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా “పుష్ప” ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరినీ పిలవకపోవడంతో ఇక స్టోరీలు స్టార్ట్ చేసారు అల్లు అర్జున్ అసలు రంగు చూపించాడని మెగా కాంపౌండ్ కి వీరికి చెడింది అని విడిపోయారు అనే రేంజ్ లో చాలా మంది కలరింగ్ ఇచ్చారు.
కానీ వీటి అన్నిటికి ఒకే ఒక్క ఫోటో బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి. నిన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ తన భార్య స్నేహ రెడ్డి సాయి ధరమ్ తేజ్ ఇలా అందరూ కూడా ఎంతో ఆనందంగా దిగిన ఫోటోని అల్లు అర్జున్ భార్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరి అన్ని గొడవలు ఉన్న వారు అయితే వేరే వేరుగానే ఈ పండుగని చేసుకోవాలి కదా ఎందుకు కలవడం? సో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది లేదు వారికి ఎలాంటి కోల్డ్ వార్స్ లేవని చెప్పేందుకు ఒక గట్టి సమాధానమే దొరికిందిగా.