అఖిల్ కండలు చూపించి దడ పుట్టిస్తున్నాడే

Akhil gives shock to everyone with his muscular body

Akhil gives shock to everyone with his muscular body

అఖిల్ అక్కినేని చేస్తున్న కొత్త చిత్రం ‘ఏజెంట్’.  సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  మొదటి నుండి సురేందర్ రెడ్డి ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొస్తున్నారు.  ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్ అని తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని చెబుతూ సినిమా గురించి, అందులో అఖిల్ పాత్ర గురించి సురేందర్ రెడ్డి భారీ హైప్ ఇచ్చారు.   దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  

 
సురేందర్ రెడ్డి చెప్పివన్నీ ఒట్టి మాటలైతే కాదు.  ఈ విషయం ఈరోజు ఆయన రివీల్ చేసిన అఖిల్ ఫోటో చూస్తే అర్థమైపోతుంది.  సినిమా కోసం అఖిల్ భారీగా బాడీ బిల్డప్ చేశాడు.  బాడీ అంటే అలాంటి ఇలాంటి బాడీ కాదు.  కండలు తిరిగి చూస్తేనే ఔరా అనేలా ఉంది.  అసలు అఖిల్ కటౌట్ ఈ స్థాయిలో మార్పు చెందగలదా అని అనుమానం వచ్చేలా ఉంది పిక్.  ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనని ముందు ముందు మీకు పండగ ఉందని, రెడీ ఫర్ ది వైల్డ్ రైడ్ అని అంటున్నారు సురేందర్ రెడ్డి.  ఈ ఫోటో చూసిన అక్కినేని ఫ్యాన్స్ తెగ థ్రిల్ అయిపోతున్నారు.  అఖిల్ తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని ఫిక్స్ అయిపోతున్నారు.