Post Covid problems: ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రెండు సంవత్సరాల ముందు మొదట కరోనా వ్యాప్తి చెందిన సమయంలో చాలా భయపడేవారు. ఇప్పుడు అనేక మందిలో ఆ భయం కనిపించడం లేదు. కరోనా తో సహజీవనం చేయాలి అని అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నిజమయ్యాయి అనిపించేలా ఉన్నాయి పరిస్థితులు. డెల్టా వేరియంట్ వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో చాలా ప్రాణ నష్టం కలిగించింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకు పడుతోంది. ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండటం వల్ల ప్రాణహాని తక్కువగా ఉంటుంది. కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత చాలా దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. మారుతున్న వేరియంట్ లలో ఉండే మ్యుటెన్ట్స్ వల్ల ఇది శ్వాస మీద మాత్రమే కాకుండా మిగిలిన శరీర భాగాల మీద కూడా ప్రభావం చూపుతుంది.దీనివల్ల వచ్చే లక్షణాలు కొన్ని రెండు వారాలలో తగ్గిపోతే, మరికొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడతాయి. అటువంటి లక్షణాలు ముఖ్యమైనది వెర్టిగో (మైకం).
వెర్టిగో అంటే ఏమిటి??
వెర్టిగో అనేది లాటిన్ పదమైన “వెర్తో” నుండి వచ్చినది. ఈ సమస్యతో బాధపడేవారు, వారిలో సమతుల్యత లోపించి ఒకచోట కూర్చున్నప్పుడు కూడా కదులుతున్నట్లు బ్రమ లో ఉంటారు, దీనినే కళ్ళు తిరగడం, తల తిరగడం అంటారు. వికారంగా ఉండటం, వాంతి రావడం, నడకలో అస్థిరత కూడా వెర్టిగో యొక్క లక్షణాలే. వీరు నడుస్తున్నా కూడా కిందకీ పడిపోతున్నట్టు, ఊగినట్టు భావన కలుగుతుంది. మైకం, కళ్ళు తిరగటం అనేవి మనిషిలో సాధారణ లక్షణాలే, అయితే ఇది శరీరంలో నీటి శాతం తగ్గితే జరిగేది. అయితే కరోనా తగ్గిన వారిలో కళ్ళు తిరగడం అనేది సాధారణంగా వచ్చినదా కరోనా తర్వాత దాని మూలంగా వచ్చిన సమస్య అని చెప్పడం కాస్త కష్టమైన పనే.
శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా దీర్ఘకాలిక సమస్యలలో తలనొప్పి శ్వాస ఆడకపోవడం అతిసార, త్వరగా అలసిపోవడం సాధారణంగా వచ్చే లక్షణాలే. తల తిరగడం కరుణ రోగుల లో కూడా ఉండే ప్రధానమైన లక్షణం. అయితే కరుణ తగ్గిన తర్వాత అలాగే ఉంటే దీనివలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కరోనా తగ్గిపోయిన తర్వాత మీరు కళ్ళు తిరగడం, అలసట, నడిచేటప్పుడు మైకం లాంటి సమస్యలు అనుభవిస్తుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
కరోనా తగ్గిన తర్వాత తల తిరిగే సమస్యను తగ్గించుకోవడానికి ముఖ్యంగా చిన్నపాటి వ్యాయామాలు చేయడం చాలా అవసరం. కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో మీ శరీరం మీద ఒత్తిడిని తగ్గించే మార్గం చూడాలి. మీరు తినే తిండి లో ఎక్కువ శాతం పోషకాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు శారీరకశ్రమ చేయకుండా, విశ్రాంతి తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవాలి. డాక్టర్ల సూచనల మేరకు కరోనా తగ్గిపోయిన తర్వాత ఒక నెలరోజులు ఈ పద్ధతులను పాటించడం వల్ల మీరు దీర్ఘకాలిక సమస్యలకు గురికాకుండా కాపాడుకోవచ్చు.