కరోనా తగ్గిన తర్వాత కలిగే దుష్పరిణామాలు.. వెల్లడించిన ఎయిమ్స్ వైద్యులు..!

Corona Virus: 2 సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేసింది. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఎక్స్ ఈ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు ఆటోఇమ్యూన్ కారణంగా రుమటాయిడ్ ఆర్థిరిటిస్, జ్వరం, గొంతు కళ్ళు పొడిబారటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న ప్పటికీ 30 మంది ఆటోఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులను పరిశీలించినట్లు ఎయిమ్స్ వైద్యులు ఈ వివరించారు. ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉన్న కణాల మీద కాకుండా బయట నుండి శరీరంలోకి ప్రవేశించి కణాల మీద దాడి చేస్తుంది. తద్వారా మన శరీరంలోని అవయవాలుగుర్తించక వాటి మీద దాడి చేస్తుంది. దీన్ని ఆటోఇమ్యూనిటీ సమస్య అని అంటారు.

డాక్టర్ రమాకుమారి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న 30 మందినీ గుర్తించినట్టు వెల్లడించారు. అయితే ఈ ఆటోఇమ్యూన్ సమస్య గ్రౌండ్ లెవెల్ లో పరిశోధన చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆటోఇమ్యూన్ సమస్యతో బాధపడేవారు ఒళ్ళు వాపెక్కటం , జ్వరం, కళ్ళు నోరు పొడిబారటం,నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.కరోనా నుండి కోలుకున్న 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.