పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజుపై జగన్ సర్కార్ వేటుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకోసం వెయిట్ చేస్తోంది. ఇప్పటికే ఇరువురు ఎవరి వాదనాలు వాళ్లు స్పీకర్ కు వినిపించుకున్నారు. ప్రభుత్వం రఘురాంపై అనర్హత వేటకు సిద్దమైంది. కాబట్టి నరసాంపురంలో మళ్లీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని మరోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో టిక్కెట్ ఆశించే ఆశావహులు భారీగానే పోగవుతున్నారు. అయితే ముందస్తుగానే వైకాపా నేత, సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీ కర్చీప్ వేసే ప్రయత్నం చేసారు. అదిష్టానం అవకాశం ఇస్తే నరసాపురం నుంచి వైకాపా తరుపును పోటీ చేస్తానని తెలిపారు.
రఘురాంలా పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదని, జగన్ పై గానీ, పార్టీని ఉద్దేశించి గానీ ఏరోజు ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు. పార్టీకి విథేయుడిగానే పనిచేసానన్నారు. నరసాపురం టిక్కెట్ ఇవ్వమని ఈ సందర్భంగా జగన్ ని కోరారు. అవకాశం వస్తే కచ్చితంగా రఘురాంని ఓడించి గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. అలాగే ప్రతిపక్ష పార్టీ టీడీపీ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు సీనైపోయిందని..లోకేష్ ఎందుకు పనికిరాడని…సొంత పార్టీలోనే అతన్ని ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. అలాగే ఇప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సేవలు టీడీపీ పార్టీకి అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ కి సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని అన్నారు.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలన ఎంతో బాగుందని…కొన్నేళ్లపాటు పాలన ఇలాగే ఉంటుందని…ప్రజలంతా సుభిక్షంగానే ఉంటారని అన్నారు. ఆయన ఉన్నంత కాలం మరో నాయకుడికి ఏపీ రాజకీయాలలో స్థానం లేదన్నారు. అలాగే పృథ్వీ ఎస్వీబీసీ లో సభ్యుడిగా కొనసాగిన నేపథ్యంలో మహిళా ఉద్యోగినితో రాసలీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించారు. అసలు ఎస్వీబీసీలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని, విజిలెన్స్ కమిటీ విచారణలోకూడా వాస్తవాలు తేలాయని అన్నారు. ఆయన ఫేవరెట్ గాడ్ వెంకన్న సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.