Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల కాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
2007లో విడుదల అయిన సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత జీవితం గురించి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజ్ అయ్యింది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది అని చెప్పు కొచ్చారు అమీర్ ఖాన్. ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.