‎Viral Vayyari: హీరో ముందు వయ్యారి సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన చిన్నారి.. దెబ్బకు షాకైన నటుడు!

‎Viral Vayyari: వైరల్ వయ్యారి.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా ఇదే పాట మారుమోగుతోంది. సోషల్ మీడియాని ఈ పాట షేక్ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటకు చిందులు వేస్తున్నారు. ముఖ్యంగా ఒక స్కూల్ యూనిఫాం ధరించిన ఒక చిన్నారి పిల్లలందరూ చూస్తుండగానే వైరల్ వయ్యారి పాటకు అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసింది.

‎అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అయింది. కాగా తాజాగా ఇదే పాటకు కర్ణాటకు చెందిన విద్యార్థిని అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఏకంగా హీరో కిరిటీ సమక్షంలోనే ఎంతో ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేసి డాన్స్ ని ఇరగదీసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను కిరిటీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మాయి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి హీరో కిరీటి రెడ్డి సైతం షాక్ అయ్యి నోరెళ్ల బెట్టారు. డ్యాన్స్ తో అదరగొట్టిన అమ్మాయికి చిన్న కానుకను కూడా అందించాడు.

‎ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్నారి డ్యాన్స్ టాలెంట్ ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో డాన్స్ ని మించి చేసింది. ఇంకా చెప్పాలంటే హీరో కంటే బాగా చేసింది అంటూ నెటిజెన్లు ఆ అమ్మాయి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మాయికి చాలా మంచి జీవితం ఉంది ఇలాగే చేస్తే మంచి స్థాయికి వెళుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‎కాదా మాజీ మంత్రి అయినా గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరిటి రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ఇందులో శ్రీ లీలా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్ ఎక్కడ చూసినా కూడా మారుమోగుతూ సంచలనం సృష్టిస్తోంది.