Junior: గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమా జూనియర్. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కిరీటి రెడ్డి. ఇది మొదటి సినిమా. ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జెనీలియా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రితం మొదలైందీ.
ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అనేక కారణాలతో ఇంతకాలం వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల కాదేమో విడుదల అవ్వడం కష్టమే అని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమాని జులై 18న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ చూస్తుంటే ఒక కాలేజీ స్టోరీ, కాలేజీలో హీరో హీరోయిన్ వెంట పడటం, తర్వాత లైఫ్ లో జాబ్ అక్కడ ఎదురయ్యే సమస్యలతో కథాంశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో వైరల్ గా మారింది. మరి జులై 18న విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉండ బోతోంది. అసలు కథ ఏమిటి అన్న వివరాలు తెలియాలి అంటే వేచి చూడాలి మరి. కాగా హీరోయిన్ శ్రీ లీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.