‎Viral Vayyari Song: వైరల్ వయ్యారి సాంగ్‌ కి స్టెప్పులు ఇరగదీసిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!

‎‎Viral Vayyari Song: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పాట వైరల్ వయ్యారి. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రేపు అనగా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

‎ముఖ్యంగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల అయిన వైరల్ వయ్యారి సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో సెన్సేషన్ ను సృష్టిస్తోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వైరల్ వయ్యారి సాంగ్ కు రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. కాగా సినిమాలోని పాటకు శ్రీ లీల అలాగే కిరీటి రెడ్డి స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు ఒక బామ్మ అదిరిపోయే స్టెప్పులు వేసింది.

https://twitter.com/VaaraahiCC/status/1945500827474350290?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1945500827474350290%7Ctwgr%5E0e070956804c2e502d301dcfc978db09b623dd83%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-actress-sreeleela-viral-vayyari-song-dance-goes-viral-2507356

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌ లో వైరల్ వయ్యారి సాంగ్‌ ను ప్రదర్శించారు. ఈ పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. వైరల్ వయ్యారి వేదికపై స్టెప్పులతో ఒక ఊపు ఊపేసింది. పక్కనే యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బామ్మ డాన్స్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.