Sreeleela: జూనియర్ సినిమాకు శ్రీ లీలా ఆ రేంజ్ లో పారితోషకం అందుకుందా.. సక్సెస్ అయితే మాత్రం!

Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా జరుపుతున్న విషయం తెలిసిందే. వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది హీరోయిన్ శ్రీ లీలా. మొదట పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. ఇకపోతే శ్రీ లీలా కు వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో విడుదల అయినా నితిన్ రాబిన్ హుడ్ సినిమా విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ఇకపోతే ఇప్పుడు మరో సరికొత్త మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. యంగ్ హీరో కిరీటి రెడ్డి హీరోగా నటిస్తూ పరిచయమవుతున్న సినిమా జూనియర్. కిరీటి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా త్వరలోనే కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి వయ్యారి అనే ఒక పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు అటు హీరో కిరీటి రెడ్డి, ఇటు శ్రీ లీలా ఇద్దరు స్టెప్పులను ఇరగదీసారు. కాగా ఈ సినిమాకు గాను శ్రీ లీలా భారీగా పారితోషికం అందుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీలా ఒక్కొక్క సినిమాకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంటే డబుల్ రెమ్యూనరేషన్ అన్న మాట. కాగా జులై 18న విడుదల కాబోతున్న జూనియర్ సినిమా హిట్ అయితే మాత్రం శ్రీ లీలా కు మరిన్ని అవకాశాలు వచ్చి చేరడం ఖాయం అని చెప్పాలి. మరోవైపు హీరోగా కిరీటి రెడ్డి కూడా సక్సెస్ అయినట్టే అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.