కరోనాను ఎదుర్కొంటానికి ప్రపంచ పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఈ వ్యాక్సిన్ ను కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చాలా మంది మార్కెట్ రకరకాల ఔషధాలను, ఆయుర్వేద మందులను వాట్సప్ యూనివర్సిటీ లో కనుగొంటుంన్నారు. వాటికి మార్కెట్ కూడా చాలా గిరాకీ పెరుగుతుంది. కరోనా నుండి కాపాడుకోవడానికి ఇమ్మ్యూనిటి పెంచుకోవాలనే ఉద్దేశంతో మనుషులు తమకు అందుబాటులో ఉన్న వాటిని నమ్ముతూ, వాడుతూ, తయారు చేసే వారికి ఆదాయాన్ని పెంచుతారు.
కరోనా వల్ల మెడీసీన్స్ షాప్స్ కు, ఔషధాల షాప్స్ కుగిరాకీ పెరిగింది. అయితే ఈ కరోనా వల్ల చాలా కంపెనీస్ నష్టాల భారిన పడ్డాయి. వాటిలో వస్త్ర దుకాణాలు తీవ్రంగా నష్టపోయాయి. అస్సలు దుస్తుల కొనుగోళ్లు బాగా నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్ లో వెరైటీగా రోగనిరోధక శక్తి పెంచే చీరలు మార్కెట్లోకి వచ్చిపడ్డాయి. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ ఈ ఇమ్యూనిటీ బూస్టర్ చీరలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు.
భోపాల్ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ ఈ ప్రత్యేక మైన వస్త్రాలు తయారు చేశాడు. లవంగాలు యాలకులు జాపత్రి దాల్చినచెక్క నల్ల మిరియాలు రాయల్ జీలకర్ర బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారీకి వాడినట్లు వెల్లడించారు. ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతి అని.. ఈ బట్టల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుందని వినోద్ తెలిపారు. ఈ చీర ధర రూ.3వేల రూపాయలుగా నిర్ణయించారు.