ఆ ఆడియో లీక్ అయ్యింది – కే‌సి‌ఆర్ వరకూ వెళ్లింది ? తెలంగాణా రాజకీయాల్లో సంచలనం !

this is the factor that effects on trs party in greater elections

తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదన్న సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో దెబ్బమీద దెబ్బ తగులుతుంది. దుబ్బాక ఎన్నికలు, వరదల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు, అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు, ఇలా కేసీఆర్ కు రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణం కూడా టీఆర్ఎస్ కు చాలా నష్టం కలిగించింది. అయితే ఆయన మరణం తరువాత ఒక ఆడియో బయటకు రావడంతో కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు.

kcr
KCR

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఒకప్పుడు ఆయన సీపీఎంలో ఉండేవారు. ఆయనకు గుర్తింపు కూడా సీపీఎంలో ఉన్నప్పుడే రాజకీయంగా కూడా ఎదిగారు. అయితే ఇప్పుడు ఆయన చనిపోయిన తరువాత ఒక ఆడియో రికార్డింగ్ బయటకు రావడం తెలంగాణ రాజకీయాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

నర్సింహయ్య వాయిస్తో ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో నర్సింహయ్య”మీ ఎర్ర జెండా బిడ్డగా కోరుకునేది ఒక్కటే. మీ అందరినీ ఎడబాసి ఏడేడు లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను ఎఫ్పుడూ కలగనలేదు. ఆ భగవంతుడు పిలిచినాడు. నేను వెళతా ఉన్నా. మీరందరూ మీ నర్సింహయ్యగా నా అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మీరు కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు’’ అని పేర్కొన్నట్లుగా ఉంది.

అయితే మొదట అందరు ఈ ఆడియో నిజమని అనుకున్నారు కానీ ఈ ఆడియో ఒక మిమిక్రి ఆర్టిస్ట్ చేశాడని, ఒకవేళ నర్సింహయ్య సీపీఎంలోనే ఉండి ఉంటే ఇలాగే కోరుకునే వారని, అందుకే ఇలా మిమిక్రి చేశారని ఆ ఆర్టిస్ట్ వివరించారు. చనిపోయిన వ్యక్తిపై ఇలా చెయ్యడం ఏంటని సోషల్ మీడియాలో ఆ ఆర్టిస్ట్ ను ప్రజలు తీవ్రంగా తిడుతున్నారు. ఇలా కేసీఆర్ కు అనుకోని రీతిలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి.