బాలయ్యతో సమానమైన వ్యక్తిని కాదు నేను: నాగబాబు

కొన్నిరోజులుగా నాగబాబు, బాలకృష్ణల నడుమ మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే.  సినీ పెద్దలు తలసానితో భేటీ కావడం, ఆ భేటీకి బాలయ్యను ఆహ్వానించకపోవడంతో బాలయ్య ఫైర్ అయ్యారు.  అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  దానికి మెగా బ్రదర్ నాగబాబు బాలక్రిష్ణ అలా మాట్లాడటం సరికాదని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  మధ్యలో తెలుగు దేశం పార్టీ గురించి కూడా వ్యాఖ్యానించారు.  దీంతో రగడ పొలిటికల్ టర్న్ తీసుకుంది. 
 
సినిమా, రాజకీయ రంగాల్లో రెండు వర్గాల మధ్య పోరులా మారిపొయింది.  తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య ఈ వివాదం మీద పెద్దగా సీరియస్ కాలేదు.  తనకు సంబంధం లేని వ్యవహారంలోకి వెళ్లనని అనేశారు.  ఇక తాజాగా నాగబాబు సైతం టీవీ చర్చలో పాల్గొని వివాదానికి ఫులుస్టాఫ్ పెట్టడానికి ప్రయత్నించారు.  బాలకృష్ణ అంటే తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్న నాగబాబు ఆయన హీరో, నేను చిరంజీవిగారి తమ్ముడిని కావొచ్చు.  కానీ కేవలం నిర్మాతను అన్నారు. 
 
హీరోతో సమానమని చెప్పుకోను.  ఆయనతో సమానమైన వ్యక్తిని కూడా కాదు.  ఆయన ఆవేశంలో మాట్లాడిన మాటల్ని ఖండించాను అంతే అన్నారు.  దాన్ని మీడియా పెద్దది చేసింది అంటూ నెమ్మదిగానే మాట్లాడారు.  నాగబాబు మాటల శైలి చూస్తే చిన్నగా మొదలై దుమారాన్ని రేపిన వివాదాన్ని కాస్త వెనక్కు ఇక్కడితో ఆపేస్తే సరైనదని భావించినట్టున్నారు.  ఏదిఏమైనా బాలయ్య, నాగబాబు ఇద్దరూ మాటల యుద్దానికి తెరదించి కొత్త వివాదాలు తలెత్తకుండా ఫులుస్టాప్ పెట్టడం మంచి పరిణామం.