టెన్త్ పాస్ కాని స్వ‌ర్ణ సుంద‌రి చుట్టూ కేర‌ళ రాజ‌కీయం

స్వ‌ప్న సుంద‌రి అలియాస్ స్వ‌ర్ణ సుంద‌రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతున్న పేరు. దేశంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీల్లోనే హాట్ టాపిక్ గా మారిన పేరు అది. స్వ‌ర్ణ సుంద‌రి అంటే ఇప్పుడు తెలియ‌ని నాయ‌కుడు లేడు. తెలియ‌ని బ‌డా నేత లేడు. అంతెందుకు తెలియ‌ని సామాన్యుడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే స్వ‌ర్ణ సుంద‌రి దేశంలో అంత‌గా పాపుల‌ర్ అయింది. బంగ‌రం స్మిగ్లింగ్ లో కేర‌ళ‌ రాజ‌కీయాల‌నే ఓ కుదుపు కుదిపేసింది. కేవ‌లం దుబాయ్ నుంచి కేర‌ళ‌కి బంగారం స్మ‌గ్లింగ్ చేయ‌డంలో రాజ‌కీయాల‌ను ఎలా వాడుకుందో తెలిసి ఒక్కొక్కిరికి దిమ్మ తిరిగిపోయింది. రాష్ర్టంలో రాజ‌కీయాల‌నే కాదు దేశ రాజ‌కీయాల‌నే మ్యానేజ్ చేసింది.

ఎయిర్ పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారుల‌ను గుప్పిట్లో పెట్టుకుంది. ఇలా క్యాబ్ డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర నుంచి బ‌డా నేత వ‌ర‌కూ అంద‌ర్నీ లాక్ చేసి ఓ సినిమా స్ర్కిప్ట్ నే త‌ల‌పించేలా ఆస‌క్తిక‌రంగా న‌డిపించింది స్మ‌గ్లింగ్ క‌థ‌ని. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌చ్చ‌లేని సీఎంగా ఖ్యాతికెక్కిన పిన‌రాయి విజ‌య‌న్ కు పెద్ద మ‌చ్చే అంటుకునేలా ఉంది స‌న్నివేశం చూస్తుంటే. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు స్వ‌ప్న వ్య‌వ‌హారం చేర‌డంతోనే ఈ సంగతుల‌న్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ దెబ్బ‌కి కేంద్ర‌లో ఉన్న బీజీపీ నాయ‌కుల గుండెల్లోనూ ఇప్పుడు రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఓసారి కేసు వివ‌రాల్లోకి వెళ్తే స్వప్న సుంద‌రి బంగారాన్ని దుబాయ్ నుంచి కేర‌ళ‌కు స్మిగ్లింగ్ చేయ‌డంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి. ఆమెకు పెద్ద స‌ర్కిలే ఉంది.

ఆమె చెబితే సీఎం కార్యాల‌యంలో ఓ ఐఏఎస్ అధికారి శివ‌కుమార్ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు ఫోన్ చేసి నిందుతుల్ని వ‌దిలేయ‌మ న‌డం. బీజీపీ నాయ‌కుడు సందీప్ నాయ‌ర్ బంగారం స్మ‌గ్లింగ్ చేస్తార‌ని ఆరోప‌ణ ఉంది. దీన్ని బ‌ల‌ప‌రుస్తూ ఆయ‌న భార్య సౌమ్య‌ వాంగ్ములం ఇవ్వ‌డం. కేర‌ళ ఆర్ధిక మంత్రితో స్వ‌ప్న స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు రావ‌డంతో ఇలా అంద‌రితోనూ ఆమె కార్య‌క‌లాపాలు న‌డిపి ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఎన్ ఐ ఏ ద‌ర్యాప్తు నుంచి ఎలాంటి మ‌చ్చ లేకుండా క్లీన్ గా బ‌య‌ట‌కు రావాల‌ని కేర‌ళ సీఎం పిన‌రాయి చూస్తున్నారు.

ఇక స్వ‌ప్న విష‌యానికి వ‌స్తే ప‌ద‌వ త‌ర‌గ‌తి కూడా పాస్ అవ్వ‌లేదు. కానీ తెలివి తెలివితేట‌లు, అవినీతికి పాల్ప‌డ‌టంలో పీహెచ్ డీ చేసింది. ప‌దో త‌ర‌గతి లేకుండానే డిగ్రీ సంపాదించింది. ఆ త‌ర్వాత చిన్న ఉద్యోగం చేస్తూ ఓ ట్రావెల్ ఏజెన్సీ న‌డిపింది. తర్వాత కొద్ది రోజుల‌కి త్రివేండ్రం ఎయిర్ పోర్టులో ఉద్యోగం సంపాదించింది. అక్క‌డే సిబ్బందితో గొడ‌వ ప‌డింది. అదే స‌మంయ‌లో ఓఐఏఎస్ అధికారిని బుట్ట‌లో వేసింది. ఆ అధికారి స‌హాయంతోనే దుబాయ్ ఎయిర్ పోర్టులో చ‌క్రం తిప్పి ఈ స్థాయికి చేరుకుంది. త‌ల్లి కేర‌ళ‌లో ఉంటారు. తండ్రి దుబాయ్ లోఉంటారు.