తెలంగాణలో కరోనా వైరస్ వీర విహారం చేస్తుంది. తెలంగాణ సర్కార్ మొదటి నుండి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా కరోనా వ్యాప్తికి బ్రేక్ పడడంలేదు. ఇక తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఒక్క హైదరాబాద్లోనే 815 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా కారణంగా ఒక్కరోజులోనే 10 మంది ప్రాణాలుకోల్పోయారని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 37,745కు చేరుకుంది. కరోనా బారిన పడి 375 మంది మరణించగా, 24,840 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 12,531 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.