వైరల్ గా మారిన ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’

పొలిటికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరిస్ కరీంనగర్స్- మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. స్ట్రీట్ బీట్జ్ సినిమా నిర్మాణంలో బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరిస్ డిసెంబర్ 22న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సిరిస్ ట్రైలర్ మరియు కరీంనగర్స్ వాలే పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

కరీంనగర్ లోని నలుగురు సామాన్య కుర్రాళ్ళ జీవితాలని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్, యాక్షన్ డ్రామా ఎమోషన్స్ తో కట్టిపడేసింది. ట్రైలర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు కనిపించాయి. నూతన నటులు అమన్ సూరేపల్లి, సాయి సూరేపల్లి ,అనిరుధ్ తుకుంట్ల ఇలా అంతా కొత్త నటులైనా, తమ సహజత్వంతో మంచి నటనని కనబరిచారు. దర్శకుడు బాలాజీ భువనగిరి కథనాన్ని గ్రిప్పింగ్ గా నడిపారు.

సంకీర్త్ రాహుల్ కెమరావర్క్ బ్రిలియంట్ గా వుంది, సాహిత్య సాగర్ సంగీతం, ఎస్.అనంత్ శ్రీకర్ నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ‘బలగం’ ఫేం రైటర్ రమేష్ ఎలిగేటి ఈ సిరిస్ కు పవర్ ఫుల్ కథా, కథనం, సంభాషణలు అందించారు. బలగం ఫ్యామిలీ డ్రామా అయితే దానికే పూర్తి భిన్నమైన పొలిటికల్ క్రైమ్ డ్రామా కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ లో నటీనటులంతా కరీంనగర్ యాసని అద్భుతంగా పలికారు.

ఈ సిరిస్ లో దాదాపు అందరూ కొత్తనటీనటులే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 50 మంది రంగస్థల నటులని ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఇందులో దాదాపు నటీనటులంతా కరీంనగర్ కు చెందిన వారే. అందరూ కొత్త యాక్టర్స్ అయినప్పటికీ చాలా అనుభవం వున్న నటులుగా అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

ఈ సిరిస్ మొత్తం కరీంనగర్ లో షూట్ చేశారు. దీంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, విజువల్ గా చాలా ఫ్రెస్ నెస్ ని తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సిరిస్ నుంచి విడుదలైన “కరీంనగర్ వాలే” పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఆస్కార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట కొత్త యూట్యూబ్ ఛానల్ విడుదల చేసినప్పటికీ వారంలో మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సూపర్ హిట్ అయ్యింది. అలాగే ట్రైలర్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

స్ట్రీట్ బీట్జ్ సినిమా మొదటి ప్రొడక్షన్ వెంచర్ ఇది. అద్భుతమైన క్యాలిటీతో ఈ సిరిస్ ని నిర్మించారు. నిర్మాణ విలువలు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సిరిస్ ని నిర్మించారు.

చిన్న టౌన్స్ కి సంబధించిన కంటెంట్‌ ని కూడా మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ నాణ్యతకు ధీటుగా రూపొందించి ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వొచ్చని ఈ వెబ్ సిరిస్ నిరూపిస్తోంది.

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ తెలంగాణ నేపధ్యంలో తొలి వెబ్ సిరిస్ గా రాబోతున్న కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. డిసెంబర్ 22నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరిస్ ప్రసారం కానుంది.