Chandrababu – Pawan: అస్వస్థతపై పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు దగ్గు కూడా తీవ్రంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్పందనను తెలియజేశారు. “గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన తిరిగి పూర్తి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందించడంతో పాటు, సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ‘ఓజీ’ సినిమా విజయాన్ని కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘ఆ సైకోను ఎవరూ గట్టిగా అడగలేదు’: అసెంబ్లీలో జగన్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి వ్యవహారంపై ఘాటు చర్చ

“మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది బాలకృష్ణే: జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు”

మరోవైపు, పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలి ప్రదర్శన నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతూ, వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.

ఇలా సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే పవన్ అనారోగ్యానికి గురికావడంతో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నేత త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

PPP Development Model: Chakravarthy Nalamotu On Chandrababu’s Governance | Telugu Rajyam