Narivetta: “నరివెట్ట” చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో టొవినో థామస్ !!!

మలయాళ హీర టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళం లో విడుదలై మంచి విజయం సాధించింది, టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కింది.

నరివెట్ట సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన ఆడియన్స్, మలయాళంలో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్షింపబడుతున్న ఈ సినిమా ను చూసి ఆడియన్స్ బావోద్యేగానికి లోనవుతున్నారు, ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో టొవినో థామస్.

త్వరలో ‘నరివెట్ట’ను తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ వారు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా వారు ప్రకటించారు. ఇటీవల ‘ఐడెంటిటీ’ ‘ఏఆర్ఎమ్’ మూవీస్ లో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఇలా పోలీస్ స్టోరీ చిత్రంతో వస్తుండటంతో ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవుతుంది.

ఇక ఈ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా అబిన్ జోసెఫ్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

The REAL Reason Behind Jagan's Arrest in Liquor Scam | Adusumalli Interview | Telugu Rajyam