Malayalam Movie: ఇటీవల కాలంలో మలయాళ సినిమాలతో పాటు వెబ్ సీరియస్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం మలయాళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటున్నాయి. కథ బాగా ఉండటంతో మలయాళ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో ఇటీవల కాలంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు మరొక సూపర్ హిట్ మూవీ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏది? హీరో ఎవరు? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అన్న విషయానికి వస్తే.. ఇటీవల మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ నటించిన నరివేట్ట సినిమా మలయాళంలో పెద్ద హిట్ అవ్వగా ఇప్పుడు త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మాణంలో అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో నరివేట్ట సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు.
ఆదివాసులకు,పోలీసులకు మధ్య జరిగే పోరాటం, అందులో పోలీస్ కానిస్టేబుల్ ఏం చేసాడు, అక్కడ గొడవలు జరగడం లాంటి కథాంశంతో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ నరివేట్ట సినిమా సోని లివ్ ఓటీటీలో జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. అయితే మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.