డిసెంబర్ 5న ‘డంకీ డ్రాప్ 4’గా ట్రైలర్ రిలీజ్ ..

షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందోనిన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగ అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ క్యూరియాసిటీని పెంచుతోంది.

‘డంకీ డ్రాప్ 1’గా విడుదల చేసిన వీడియో, ‘డంకీ డ్రాప్ 2’గా విడుదల చేసిన ‘లుట్ పుట్ గయా..’ , ‘డంకీ డ్రాప్ 3’గా రిలీజైన ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే’ పాటలు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘డంకీ డ్రాప్ 4’గా రాబోతున్న ట్రైలర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకున్నాయి. ఈ ట్రైలర్‌ను మేకర్స్ డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు.

‘‘అందరూ చర్చించుకునే పాయింట్‌తో డంకీ సినిమాను రూపొందించారనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది. అందరి హృదయాలను ఈ కథ కదిలిస్తుంది. దీంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే మరెన్నో అంశాలతో సినిమా మెప్పించనుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి ట్రీట్‌లా సినిమా ఉండనుంది. కుటుంబమంతా కలిసి చూసే ఎంజాయ్ చేసేలా ఉండే డంకీ సిినిమాతో ప్రేక్షకులు ఈ ఏడాదిని పూర్తి చేస్తారు’’ అని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

‘డంకీ డ్రాప్ 4’గా విడుదల కాబోతున్న ట్రైలర్‌కి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. హృదయాన్ని హత్తుకుంటూనే నవ్వించే కథలతో సక్సెస్‌ఫుల్ సినిమాలను రూపొందించిన రాజ్‌కుమార్ హిరాని మరోసారి తన మ్యాజిక్‌ను క్రియేట్ చేయనున్నారు. మీకెంతో ఇష్టమైన కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సంతోషకరమైన క్షణాలను అందించే ‘డంకీ’ సినిమాను చూసేలా ‘డంకీ డ్రాప్ 4’ ఓ ఆసక్తిని రేకెత్తించనుంది.

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.