Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ కింగ్. ఈ సినిమా షూటింగ్ లో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. షారుఖ్ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుఖ్ ఖాన్,అతని బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. కింగ్ సినిమా కోసం ఒక యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం జరుగుతోన్న కింగ్ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై షారుక్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇకపోతే షారుక్ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే.. పఠాన్, జవాన్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తున్నారు.
యాక్షన్ కథా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఇందులో సుహానా ఖాన్ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
Shah Rukh Khan: అశ్వస్థతకు గురైన హీరో షారుఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే!
