‘బ్రో’ సినిమా చుట్టూ వివాదం!

బ్రో సినిమా చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం నడుస్తోంది. ముఖ్యంగా సినిమాలో అంబటి రాంబాబుని అనుకరించే విధంగా పాత్రని క్రియేట్‌ చేసి సెటైర్లు వేయడంపై అతను హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా డిజాస్టర్‌ అంటూ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ వేయడంతో పాటు నిర్మాత విూద తీవ్రమైన ఆరోపణలు చేశారు. హవాలా సొమ్ములు తీసుకొచ్చి బ్రో సినిమాకి పెట్టుబడులు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలపై టీవీ ఛానల్స్‌ నిర్మాత విశ్వప్రసాద్‌ ని పిలిచి ఇంటర్వ్యూలు చేశాయి. ఇందులో విశ్వప్రసాద్‌ చెప్పిన సమాధానాలకి టాలీవుడ్‌ లో చాలా మంది నుంచి ప్రశంసలు వస్తూ ఉండటం విశేషం.

సినిమా బడ్జెట్‌ గురించి న్యూస్‌ యాంకర్‌ అడిగినపుడు దానికి సంబందించిన విషయాలు అన్ని జీటీవీ, మాకు మధ్య ఉన్న ఒప్పందం. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ స్టెయ్రిట్‌గా చెప్పేశారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ కి రెమ్యునరేషన్‌ ఎంత ఇచ్చారని మళ్ళీ అడిగే ప్రయత్నం చేశారు. అది పవన్‌ కళ్యాణ్‌ కి, మాకు మధ్య జరిగిన అగ్రిమెంట్‌ ఎవ్వరికి దాని గురించి అడిగే హక్కు లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇన్‌ కం ట్యాక్స్‌ ్గªల్‌ చేసినపుడు ప్రభుత్వానికి మేము దానిపై రిపోర్ట్‌ ఇచ్చుకుంటాం అని చెప్పుకొచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నారని చెప్పారు కదా. అది విూరు ఇచ్చిందేనా అని అడగగా ఆ విషయం పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే చెప్పాలి.

నేను దాని గురించి మాట్లాడకూడదు అంటూ స్టైట్ర్‌ ఆన్సర్‌ ఇచ్చారు. అలాగే అంబటి రాంబాబు బ్లాక్‌ మనీ బ్రో సినిమాకి పెట్టుబడిగా పెట్టారని చేసిన ఆరోపణలపై కూడా విశ్వప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. పక్కాగా అన్ని నిబంధనలు అనుసరించి మా సినిమా బడ్జెట్‌ ఖర్చు జరిగింది. వారి ఆరోపణలు అస్సలు నేను పట్టించుకోను అంటూ చెప్పారు. ఇలా ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్‌ ఇచ్చిన సమాధానాలపై టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా విూరు గట్స్‌ ఉన్న వ్యక్తి అంటున్నారు. అవసరం లేని ప్రశ్నలకి అంతే ఘాటుగా విశ్వప్రసాద్‌ చాలా స్పష్టంగా ఆన్సర్‌ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది.