ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు

ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ లు వచ్చాయి. దీంతో కలిసే ఉండి ఉద్యోగాలు చేసేవారు. ఇలా వారి మధ్య ఏర్పడిన స్నేహం ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని విధంగా దోస్తులయ్యారు. పెళ్లిళ్లు చేసుకుంటే విడిపోవాల్సి వస్తుందని అందుకే తామే పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు వద్దని వారించినా వినకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఒరిస్సాలోని కేంద్రపడ పట్టణంలో ఈ స్వలింగ వివాహం సంచలనంగా మారింది. పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన సావిత్రి, మోనాలిసా కటక్ లో కలిసి చదువుకునేవారు. ఇద్దరు కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. వారి చదువులు పూర్తయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో జాబులు రావడంతో ఇద్దరు కలిసే ఉండి పనికి వెళ్లేవారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇద్దరు అమ్మాయిలు వారి ఇండ్లల్లో చెప్పారు. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో కోర్టు ఆశ్రయించారు. ఒకరు భార్యగా మరొకరు భర్తగా అఫిడవిట్ లో పేర్కోన్నారు. చివరకు రిజిష్టర్ పెళ్లి చేసుకున్నారు.