తల్లి కడుపులోంచి బలంగా గుంజడంతో రెండు ముక్కలుగా బయట పడ్డ బిడ్డ

నెలలు నిండిన ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే మేల్ నర్స్ నిర్లక్ష్యంతో దారుణ జరిగిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో జరిగింది. ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ రామ్ ఘడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురుడు పోసేందుకు డ్యూటిలో ఉన్న ఓ మేల్ నర్సు శిశువుని మహిళ కడుపులోంచి రెండు చేతులతో బలంగా లాగాడు. దీంతో చిన్నారి రెండు భాగాలుగా విడిపోయి ముక్కలుగా వచ్చింది.

దీనిని చూసిన ఇతర సిబ్బంది, డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. శిశువు తల భాగం మాత్రం మహిళ కడుపులోనే ఉండి పోయింది. శిశువు కింది భాగాలను మార్చురీలో ఉంచి మహిళను మెరుగైన చికిత్స కోసం జైసల్మేర్ లోని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వైద్యుడు సలహా ఇచ్చాడు.

ఆ మహిళకు డాక్టర్ రవీంద్ర శంఖ్లా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం చికిత్స చేసి పాప తలను ఆమె కడుపులోంచి తీశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న వారంతా షాకయ్యారు. మరికొందరు ఆ తల్లి, మరణించిన పాపను తలుచుకొని కన్నీరుమున్నీరయ్యారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదు మేరకు మేల్ నర్సు పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.