రాజ్యసభలో కత్తుల కౌగిలి

రాజ్యసభ డిప్యూటి చైర్మన్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్ది హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. అధికార పక్షాల అభ్యర్ధి హరివంశ్ నారాయణ సింగ్.. విపక్షాల అభ్యర్ధి బి.కె. హరిప్రసాద్ పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

హరివంశ్ నారాయణ సింగ్ జేడీయూ ఎంపీగా ఉన్నారు.హరివంశ్ సింగ్ కు 122 ఓట్లు రాగా బికె హరిప్రఃసాద్ కు 105 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ ఎస్ ఎన్డీఏ అభ్యర్ధికి ఓటేయగా టిడిపి కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటేసింది. రాజ్య సభ డిప్యూటి చైర్మన్ ఎన్నికకు ఆప్ , వైసిపి, పిడిపి ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు సభకు హాజరయ్యినా ఓటింగ్ లో పాల్గొనలేదు.

హరివంశ్ నారాయణ సింగ్ మంచి ప్రతిభావంతుడని ప్రధాని మోదీ అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ మీడియా అడ్వైజర్ గా సింగ్ పనిచేశారు. మరికొంత కాలం హైద్రాబాద్ ఆర్ బీఐ లో కూడా పనిచేశారు.

నారాయణ్‌ను అభినందిస్తున్న ప్రధాని మోదీ

ఆగష్టు 6 న జరిగిన పార్లమెంట్ అకౌంట్స్ కమిటీ సభ్యుడి ఎన్నికల్లో బిజెపీ వ్యతిరేక పార్టీలన్ని ఏకమయ్యి టిడిపి కి చెందిన ఎంపీ సీఎం రమేష్ ను గెలిపించాయి.

దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి కంటే సీఎం రమేష్ కు 37 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. పబ్లిక్ అకౌంట్స్ లో ప్రాతినిథ్యం కోసం ఈ ఎన్నికలు జరిగాయి.

తాజాగా రాజ్యసభ డిప్యూటి చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ది కి టిడిపి మద్దతు పలకడంతో గత కొంత   కాలంగా కాంగ్రెస్, టిడిపి కలుస్తాయని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పరిస్థితిలో టిడిపితో చేతులు కలపడమే  మంచిదని ఆ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. పొత్తులో ముందుకు వెళ్లే భాగంలోనే టిడిపి , కాంగ్రెస్ పరస్పరం సహకరించుకున్నాయని పలువురు అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్, టిడిపి కలయిక ఎలా మారబోతుందో అన్న చర్చ మొదలైంది.