ఆర్బీఐ కీలకమైన వడ్డీ రేట్లను తగ్గిస్తూ శుభవార్తను చెప్పింది. రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణం పై వడ్డీ రేటు) ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.25 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపుతో రుణాల పై వడ్డీ రేటు భారం తగ్గనుంది. ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
రివర్స్ రెపో రేటును (ఆర్బీఐకి బ్యాంకులు ఇచ్చే రుణం పై వడ్డీ) 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ను 6.5 శాతంగా ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మానిటరీ పాలసీ కమిటీ తెలిపింది. శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.