రాహుల్ రెండు రోజుల తెలంగాణ టూర్ విజయవంతం అయింది. చిన్న చిన్న సంఘటనలు మినహా టూర్ బాగానే సాగింది. హరిత ప్లాజాలో స్టూడెంట్ లీడర్లు కొద్దిగా డిష్యుం డిష్యుం కు దిగడం తప్ప అంతా సవ్యంగానే సాగింది. అధికార టిఆర్ఎస్ పార్టీపై రాహుల్ గురి చూసి విమర్శలు చేశారు. టీఆరెస్ కూడా ధీటుగానే బదులు ఇచ్చింది. కానీ రాహుల్ టూర్ పై ఫేక్ ఫైట్ కూడా స్టార్ట్ అయింది.
రాహుల్ టూర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొందరు సర్కులేట్ చేస్తున్నారు. బూతు అర్థం వచ్చేలా ఫ్లెక్సీలను మార్ఫింగ్ చేశారు.
సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ సందర్భంగా ఎల్ బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి రాహుల్ కి స్వాగతం తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో రాహుల్ గాందీ పేరు దగ్గర ఇంగ్లీషులో RAHUL GANDHI అని స్పష్టంగా ఉన్నా RAHUL GANDU అని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. GANDU అంటే హిందీలో గలీజు అర్ధం వస్తుంది. ఇది టిఆర్ ఎస్ వాళ్లు కావాలనే చేశారని , సుధీర్ రెడ్డిని బద్నాం చేసేందుకు ప్రత్యర్థులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
రాహుల్ టూర్ సంధర్బంగా వైరల్ అవుతున్న ఫేక్ ఫోటో
రాహుల్ టూర్ సంధర్బంగా ఏర్పాటు చేసిన రియల్ ఫోటో
రాహుల్ గాంధీ టూర్ సక్సెస్ అయ్యిందని ఇది తట్టుకోలేక కడుపు మంటతో టిఆర్ ఎస్ నాయకులు చేయిస్తున్న దుష్ప్రచారమని వారి దుష్ప్రచారాలకు భయపడేది లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. టిఆర్ ఎస్ వాళ్లు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే టిఆర్ ఎస్ కు బుద్ది చెప్తారిని వారన్నారు.
రాహుల్ గాంధీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఘటనపై కూడా టిఆర్ ఎస్ విమర్శలు చేయడం పనికిమాలిన చర్య అని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. అమర వీరుల స్థూపం వద్ద ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ వీ నేతలు గన్ పార్క్ ను పాలతో శుద్ది చేయడానికి యత్నించారు. అదే సమయంలో అక్కడున్న ఎన్ ఎస్ యూఐ నేతలు దానిని అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత కు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకొని వారించారు. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా అలంకరణ చేశారు కాబట్టి పాలాభిషేకం చేస్తే అంతా ఆగం అయితుందని చెప్పటంతో పూలపైన పాలు చల్లి వెళ్లిపోయారు. ఈ ఘటనను కాంగ్రెస్ నేతలు ఖండించారు.
ఇక రాహుల్ చేసిన కుటుంబ పాలన విమర్శలు టిఆర్ఎస్ కు గట్టిగానే గుచుకున్నాయి. సీఎం కేసీఆర్ రాహుల్ విమర్శలపై స్పందించారు. మీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన బెటర్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ మళ్ళీ కేసీఆర్ కు బదులు ఇచ్చారు. 1994 తర్వాత మా కుటుంబము అధికారంలోనే లేదు.. కానీ మీ కుటుంబం మొత్తానికి మొత్తం అధికారం అనుభవిస్తోంది అని పంచ్ ఇచ్చారు.
ఇక రాహుల్ టూర్ మీద కేటీఆర్ కూడా ట్విట్ ద్వారా విమర్శలు గుప్పించారు. మీ నాయనమ్మ కాలంలో అమరవీరులకు నువ్వు నివాళులు అర్పిస్తున్నావు.. క్షమాపణ లు కోరాలి అని డిమాండ్ చేశారు.
మొత్తానికి రాహుల్ టూర్ అధికార టిఆర్ఎస్ పార్టీకి గట్టిగానే కాక పుట్టించింది అని కాంగ్రెస్ శ్రేణులు జోరు మీద ఉన్నాయి.