కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన కోసం సోమవారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటున్నారు. తొలుత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. మహిళలతో భేటీ అయిన రాహుల్ సభలో ఒక ఇంటరెస్టింగ్ సీన్ జరిగింది.
రాహుల్ గాంధీతో ఫోటో దిగాలని కోరిన ఆదివాసీ మహిళకు అనుమతి ఇచ్చారు రాహుల్. మహబూబ్ నగర్ జిల్లా,పాలమూరు మద్దూర్ మండలంకి చెందిన కేసీ భాయ్ కోరిక మేరకు ఆమెతో ఫోటో దిగారు రాహుల్ గాంధీ. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి పరామర్శించారు. ఎస్టీ మహిళ అయిన కేసి భాయ్ తో రాహుల్ ప్రవర్తించిన తీరుతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.