సెంచురీ వైపు ఇండియా దూసుకుపోతున్నది….

ఇదిగో… భారతీయులంతా గర్వపడండి. క్రికెట్ లో తప్ప  చాలా విషయాల్లో మనం సెంచురీల కొట్టలేకపోయి ఉండవచ్చు. చింతించకండి. ఇపుడు ఎవరూ వూహించని రంగంలో భారత్  టీం మోదీ  దూసుకుపోతున్నది.  సెంచురీ వైపు పరుగులు తీస్తున్నది.  కొద్ది గా ఒపిక పట్టండి. మనం అల్ టైం రికార్డు సాధించపోతున్నాం. ఏరంగంలో ననుకుంటున్నారు. పెట్రోలు ధరలలో….

 సోమవారం నాడు పెట్రోలు డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి.  లీటరు పెట్రోలు 15 పైసలు,  డీజిల్ పై 6 పైసలు పెరిగాయి.  దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.06కు, డీజిల్ ధర రూ. 73.78కు చేరుకున్నాయి.

ఇక  ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44కు డీజిల్ ధర రూ. 78.33కు పెరిగింది.

దీపావళికల్లా సెంచురీ పండగ చేసుకోవచ్చిన అంతా నమ్ముతున్నారు.